పేదరికం లేని సమాజం కోసం అందరూ కృషిచేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. స్వర్ణభారత్ ట్రస్టు వార్షికోత్సవంలో మాట్లాడారు. ఇక్కడికి వచ్చిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. వ్యవసాయంలో నూతన సాంకేతికతలు వస్తున్నాయనీ...అందుకు అనుగుణంగా మెళకువలు అవసరమని చెప్పారు.భారత్‌లో యువత అధికంగా ఉందనీ, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ట్రస్టు లక్ష్యమని పేర్కొన్నారు. భారత సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భరతనాట్యం, కూచిపూడిని ప్రోత్సహించాలని చెప్పారు.
'పేదరికం లేని సమాజం కావాలి' - trust
మానవసేవే-మాధవసేవ అని మహాత్ముడు చెప్పిన సూత్రాన్ని పాటించడమే అన్నింటికంటే గొప్పదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. పేదరికం లేని సమాజ స్ధాపనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని సూచించారు. ఎంతోమంది శాస్త్రవేత్తలను ప్రపంచానికి అందించిన ఘనత భారతదేశానిదని కొనియాడారు.
పేదరికం లేని సమాజం కోసం అందరూ కృషిచేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. స్వర్ణభారత్ ట్రస్టు వార్షికోత్సవంలో మాట్లాడారు. ఇక్కడికి వచ్చిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. వ్యవసాయంలో నూతన సాంకేతికతలు వస్తున్నాయనీ...అందుకు అనుగుణంగా మెళకువలు అవసరమని చెప్పారు.భారత్‌లో యువత అధికంగా ఉందనీ, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ట్రస్టు లక్ష్యమని పేర్కొన్నారు. భారత సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భరతనాట్యం, కూచిపూడిని ప్రోత్సహించాలని చెప్పారు.
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నెల్లూరు విచ్చేసారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ఆయన చెన్నై నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్నారు. రాష్ట్రపతికి మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి లు ఘనంగా స్వాగతం పలికారు. పోలీస్ గ్రౌండ్ నుంచి రిత్విక్ ఎంక్లేవ్ దగ్గర ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి బయలుదేరారు. అక్కడి నుంచి వెంకటాచల మండలంలోని అక్షర స్కూల్ కి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించి, స్వర్ణ భారత్ ట్రస్ట్ వెళ్లనున్నారు. రాష్ట్రపతి పర్యటన కోసం అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.
Body:కిరణ్ ఈటీవీ భారత్
Conclusion:9394450291