ETV Bharat / state

యూరియా కొరత లేకున్నా... ఎరువు ధరల దరువు - నెల్లూరులో యూరియా ధరలు పెంపు

ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. రైతులకు చేయూతనివ్వాలన్న ఆశయం చతికిల పడింది. గ్రామస్థాయిలోనే అన్నిరకాల సేవలు అందించాలన్న ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే)లకు శ్రీకారం చుట్టగా- ఆ దిశగా సత్ఫలితాలు రావడం లేదు. కర్షకులకు తక్కువ ధరకే ఎరువులు అందజేయాల్సి ఉండగా.. వ్యవసాయాధికారుల నిర్లక్ష్యంతో క్షేత్రస్థాయిలో ఆచరణ విఫలమవుతోంది.

urea rates are higher in private fertilizer shops in nellore district
కోతకు వచ్చిన వరిపంట
author img

By

Published : Aug 13, 2020, 2:17 PM IST

ప్రతి ఏడాదిలాగే... ఈ సంవత్సరమూ ప్రైవేట్‌ ఎరువుల దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదునుగా పలువురు వ్యాపారులు అధిక ధరలకు ఎరువులు, పురుగుల మందులు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రైతులు మాత్రం ఆర్థిక భారంతో చితికిపోతున్నారు.

  • అదనంగా రూ.20..

ఖరీఫ్‌లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష హెక్టార్లలో వరి, సజ్జ, పత్తి తదితర పంటలు సాగవుతున్నాయి. 660 రైతు భరోసా కేంద్రాలున్నాయి. వాటి ద్వారా రైతులకు తక్కువ ధరకు ఎరువులు అందజేయాల్సి ఉండగా- ఆ దిశగా వ్యవసాయాధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. గ్రామ వ్యవసాయ సహాయకుల అవగాహన రాహిత్యం, సర్వర్‌ మొరాయింపు తదితర కారణాలతో ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇప్పటికే జిల్లాలో వరినాట్లు పూర్తవడంతో... అన్నదాతలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు దుకాణాలను ఆశ్రయించి కొనుగోలు చేస్తున్నారు. దాంతో వ్యాపారులు ఒక్కో యూరియా బస్తా పైన సుమారు రూ.30 నుంచి రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలోని కర్షకులపై రూ.2.49 కోట్ల మేర భారం పడుతోందని రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • భారీగా వ్యత్యాసం...

ఆర్‌బీకేల ద్వారా 45 కిలోల యూరియా బస్తాను రూ.266.50కు విక్రయిస్తున్నారు. అదే ప్రైవేట్‌ దుకాణాల్లో సుమారు రూ.300 నుంచి రూ.320 వరకు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల మేరకు 82,600 హెక్టార్లలో వరి సాగు చేయగా- సుమారు 63 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఇప్పటికీ ఆర్‌బీకే గోదాముల్లో, సహకార సంఘాల్లో సుమారు 52వేల మెట్రిక్‌ టన్నుల యూరియా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. జిల్లాలో యూరియా కొరత లేకున్నా... రైతులు మాత్రం ప్రైవేట్‌ దుకాణాల్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ విషయంలో వ్యవసాయాధికారులు మీనమేషాలు లెక్కిస్తుండటం గమనార్హం.

ప్రైవేట్‌ను ఆశ్రయిస్తున్నాం

నేను పన్నెండు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. మా గ్రామంలోనే ఆర్‌బీకే కేంద్రముంది. అక్కడ నగదు చెల్లిస్తేనే ఎరువులు ఇస్తామని చెప్పడం వల్ల... తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్‌ దుకాణాన్ని ఆశ్రయించా. ఒక్కో బస్తా రూ.300 చొప్పున 40 బస్తాలు కొనుగోలు చేశాను. ప్రైవేట్‌గా కొనడం వల్ల సుమారు రూ.1200 అధికంగా చెల్లించాల్సి వచ్చింది. - బాబు, గుండాలమ్మపాళెం

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

ప్రైవేటు దుకాణాల్లో ఎరువులను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలి. అధిక ధరలకు అమ్మితే తమ దృష్టికి తీసుకురావాలి. అలాంటి దుకాణాలపై దాడులు చేపట్టి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. వచ్చే పంట కాలం నాటికి నెల్లూరు జిల్లాలోని రైతులందరికీ సకాలంలో ఎరువులు అందించేందుకు చర్యలు తీసుకుంటాం. - శివన్నారాయణ, ఇన్‌ఛార్జి ఏడీఏ

ఇదీ చదవండి :

'అన్నింటి ధరలు పెంచడమే తప్ప తగ్గించే సూచనలు లేవు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.