నెల్లూరు జిల్లా కోవూరు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని నెల్లూరు వైద్యశాలకు తరలించారు.. నెల్లూరు హరినాథపురానికి చెందిన ఓ కుటుంబం కుమారుడిని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉన్న హాస్టల్లో ఐదో తరగతి చేర్పించేందుకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కోవూరు ఏసీసీ కల్యాణ మండపం వద్దకు రాగానే కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. దీంతో కారులో ఉన్న విద్యార్ధి తాత, పార్లపల్లి సుధాకర్‌రావు(76), అమ్మ అపర్ణ(30) అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని వారు తెలిపారు.
ఇదీ చదవండీ.. విశాఖ 47వ వార్డు కార్పొరేటర్ కామేశ్వరిపై కేసు నమోదు