నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బుధవాడ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. ఇంకొకరు ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితులు కడప జిల్లా గోపవరం మండలం బెడుసుపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. నందిపాడు గ్రామంలో కూలి పనులకు వెళ్లి తిరిగి స్వగ్రామమైన బెడుసుపల్లి వెళ్తుండగా.. మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి..