అంత్యక్రియలకు వెళ్తూ అనంత లోకాలకు - road accident in atmakuru mandal
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బండారుపల్లి వద్ద ఆర్టీసీ బస్సు బైక్ ఢీ కొనడం వల్ల బైక్పై ఉన్న ఇద్దరు మృతి చెందారు. వీరు కనుపూరుపల్లి గ్రామం నుంచి అనంతసాగరం మండలం దేవరాయపల్లి గ్రామంలో అంత్యక్రియలకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.