ETV Bharat / state

విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి - Farmers killed in Atmakuru, Nellore district

రేపో.. మాపో.. పంట చేతికివస్తుందని సంతోషంగా.. పొలానికి వెళ్లిన ఇద్దరు అన్నదాతలు.. తిరిగిరాని లోకాలకు వెళ్లారు. రైతన్నలను వేర్వురు చోట్ల మృత్యువు కరెంట్ రూపంలో కబలించిందన్న చేదు వార్త విన్న కుటుంబీకులు తల్లడిల్లిపోయారు. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలో జరిగింది.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్​తో ఇద్దరు రైతులు మృతి

author img

By

Published : Mar 29, 2021, 8:45 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలో విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి చెందారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నాగేంద్రపురానికి చెందిన రైతు రమణారెడ్డి, బట్టెపాడు వద్ద తనకున్న రెండు ఎకరాల పొలంలో పత్తి సాగు చేస్తున్నాడు. రెండు రోజుల నుంచి మోటర్​కి విద్యుత్ సరఫరా రాకపోవడంతో ట్రాన్స్​పార్మర్ దగ్గరకు వెళ్ళి చూడగా ప్యూజు పోయింది. దానిని సరిచేసే క్రమంలో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. చెజర్ల మండలం కాకివాయి గ్రామంలో యువ రైతు మనోజ్ పంట పొలంలోని మోటర్​కు మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతంతో మృతి చెందాడు. రైతన్నల మృతితో ఆ గ్రామాల్లో విషాదం నెలకొంది.

ఇవీ చదవండి

జూదరుల అరెస్ట్.. సెబ్ పోలీసుల తీరుపై గ్రామస్థుల అభ్యంతరం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.