ETV Bharat / state

రఫేల్‌ ప్రాజెక్టులో భాగం పంచుకోనున్న నెల్లూరు కంపెనీలు

డసాల్ట్‌-రఫేల్‌ యుద్ధ విమానాల ప్రాజెక్టులో నెల్లూరు జిల్లాలోని రెండు కంపెనీలు భాగం పంచుకోనున్నాయి. వాటి విభాగాలను ఈ కంపెనీలు అందించనున్నాయి.

Two companies in Nellore district are part of the Raphael warplanes project
రఫేల్‌ యుద్ధ విమానాల ప్రాజెక్టులో నెల్లూరు జిల్లాలోని రెండు కంపెనీలు భాగం
author img

By

Published : Sep 12, 2020, 1:18 PM IST

మేక్‌ ఇన్‌ ఇండియా ఆశయాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన డసాల్ట్‌-రఫేల్‌ యుద్ధ విమానాల ప్రాజెక్టులో శ్రీసిటీలోని రెండు పరిశ్రమలు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నట్లు శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక్కడి హంటర్‌ డగ్లస్‌ ఇండియా పరిశ్రమ ద్వారా విమానాలు కొలువుతీరే సర్వీస్‌ హ్యాంగర్‌ మెటల్‌ పైకప్పును ఏర్పాటు చేస్తుండగా, సిద్ధార్థ లాజిస్టిక్‌ పరిశ్రమ తన గిడ్డంగిలో ప్రాజెక్టుకు సంబంధించిన పలు విడిభాగాలను భద్రపరచి సరఫరా చేస్తోంది. హంటర్‌ డగ్లస్‌ పంజాబ్‌లోని అంబాలా ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో రఫేల్‌ ఫైటర్‌ జెట్‌ హ్యాంగర్‌ కోసం ‘లుక్సలోన్‌ 300సి’ లీనియర్‌ మెటల్‌ కప్పును విజయవంతంగా సరఫరా చేసింది. అదేవిధంగా శ్రీసిటీలోని సిద్ధార్థ లాజిస్టిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డసాల్ట్‌ ఫ్రాన్స్‌కు చెందిన విడి భాగాలను తన గిడ్డంగిలో భద్రపరుస్తోంది. అనేక విదేశీ రక్షణ పరికరాల సరఫరాదారులు తమ ఉత్పత్తి సామగ్రిని ఇక్కడ నిల్వ ఉంచుతున్నారు. ఇప్పటికే వీఆర్వీ ఆసియా పసిఫిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమ క్రయోజనిక్‌ ట్యాంకులను తయారుచేసి షార్‌కు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదీ చూడండి. పబ్జీ‌ ఆటకు బానిసై బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.