ఓ మహిళను హతమార్చేందుకు ఇంటికే నిప్పు పెట్టాడో ప్రబుద్దుడు. ఈ ఘటనకు కారకులైన వారిని ఓ టోపీ పట్టించిన ఘటన.. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో జరిగింది.
అనుమానంతోనే..
కోవూరు మిక్స్‌డ్ కాలనిలో నివాసముండే ఓ మహిళ అదే ప్రాంతానికి చెందిన డేవిడ్ జాన్సన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. కొద్ది రోజులుగా ఆ మహిళ మరో వ్యక్తితో చనువుగా ఉండటంతో అనుమానం పెంచుకున్న జాన్సన్.. ఆ మహిళను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితుల సహకారంతో ఆ మహిళ ఇంటిని పెట్రోల్ పోసి దహనం చేశాడు. మంటల్లో ఆ మహిళ మృతి చెందితే అగ్నిప్రమాదమే కారణమౌతుందని భావించాడు. అయితే నిప్పు పెట్టిన సమయంలో ఆ మహిళ ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడింది. ఇంట్లోని వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి.
నిందితులను పట్టించిన టోపీ
కేసు నమోదు చేసిన పోలీసులు.. సంఘటన స్థలంలో దొరికిన ఓ టోపీ (క్యాప్) నిందితులను పట్టించింది. ఆ టోపి డేవిడ్ జాన్సన్ దేనని పోలీసులు గుర్తించారు. ఘటనకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతనిని త్వరలోనే పట్టుకుంటామని కోవూరు సీఐ. క్రిష్ణారెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: