నెల్లూరు జిల్లా కావలిలోని ఇందిరానగర్ లో నివాసముండే రాజేశ్... జులైలో ముత్తూట్ ఫైనాన్స్ లో నకిలీ బంగారం తనఖా పెట్టి లక్షా నలభై ఒక్క వేల రూపాయల్ని తీసుకున్నాడు. కొంత కాలం తర్వాత సంస్థ సిబ్బందికి ఆ బంగారం నకిలీదని అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. చేసిన తప్పును నిందితుడు అంగీకరించాడు. అతడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.
ఇదీ చదవండి:
గాంధీజీ ప్రారంభించిన పినాకిని ఆశ్రమం... నేడు పర్యటక ప్రాంతం..