నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం సిద్ధ గుంట గ్రామ సమీపంలోని సిద్దేశ్వర స్వామి గుడి వద్ద హుండీలో సొమ్ము దుండగులు అపహరించారు. నాలుగు నెలలకు ఒకసారి ఈ హుండీలో సొమ్మును గ్రామస్థులు లెక్కించి గుడి నిర్వహణకు వినియోగించేవారు. రాత్రిపూట చోరీ జరిగిందని ఉదయం వెళ్ళిన పూజారి గుర్తించి గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. దాదాపు ఆరు వేలకు పైగా నగదు హుండీలో ఉండవచ్చని పూజారి తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి