2020 - 21 నెల్లూరు జిల్లా రుణ లక్ష్యం రూ.13, 590 కోట్లుగా ప్రభుత్వం నిర్దేశించిందని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇందులో రూ.7,700కోట్లు వ్యవసాయ రంగానికి, రూ.1,600 కోట్లు దీర్ఘకాలిక రుణాలు, పారిశ్రామిక రంగాలకు రూ.5,890 కోట్లు గ్రామీణాభివృద్ధి గోదాములకు రూ.200కోట్లు, వ్యవసాయ అనుబంధ శాఖలకు రూ.300 కోట్లు ప్రకటించిందని వివరించారు. ప్రధానమంత్రి నిర్బన్ పథకం ద్వారా వ్యవసాయం చేసే పాడి రైతులకు రూ.మూడు లక్షలను పశువుల కిసాన్ కార్డు ద్వారా ఇస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: