నిర్మాణం పూర్తయిన హౌస్ ఫర్ ఆల్ ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో సీపీఎం ఆందోళన వ్యక్తం చేసింది.నెల్లూరు రూరల్ ప్రాంతంలోని అల్లీపురం వద్ద ధర్నా చేపట్టింది. రాజకీయ కారణాలతోనే ఇంకా ఇళ్లను పేదలకు ఇవ్వటం లేదని సీపీఎం నేత మాదాల వెంకటేశ్వర్లు ఆరోపించారు.
రెండేళ్ల క్రితమే పూర్తయిన ఇళ్ల నిర్వహణ సక్రమంగా లేక దెబ్బతింటున్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని డీమాండ్ చేశారు. లేదంటే వారే ఇళ్లల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని అందుకు తాము పూర్తీ సహకారాన్ని అందిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: