నెల్లూరులోని ప్రఖ్యాత రంగనాథస్వామి ఆలయ రథోత్సవంపై కరోనా ప్రభావం పడింది. ఉత్సవాన్ని ఆలయం తూర్పు వీధికే పరిమితం చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ వేడుక నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చారు. ముందుగా.. రథోత్సవాన్ని రద్దు చేయాలని అధికారులు భావించినా.. అపచారం జరుగుతుందన్న ఉద్దేశంతో నిర్ణయం మార్చుకున్నారు. చిత్రకూటం నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు సాగాల్సిన రథోత్సవాన్ని ఆలయం తూర్పు వీధికే పరిమితం చేశారు. స్వామివారి ఎదుర్కోలు ఉత్సవాన్ని రద్దు చేశారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: