Anam Venkata Ramana Reddy: నెల్లూరు కోర్టులో సాక్ష్యాల చోరీ ఘటన సినిమా డ్రామాను తలపిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై జరిగిన విచారణ తీరును జిల్లా జడ్జి యామిని అనుమానం వ్యక్తం చేస్తూ తన నివేదికను హైకోర్టుకు తెలియజేశారన్నారు. పోలీసులు తెలిపినట్లు ఇనుము కోసం వచ్చిన ఇద్దరు దొంగలు సాక్ష్యాల్ని ఎత్తుకుపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎనిమిది అల్మారాలు ఉంటే,.. దానిలో ఒక అల్మారాకు తాళం వేయలేదని, అందులోని సాక్ష్యాలను మాత్రమే దొంగలు చోరీ చేసి కాలువలో పడేయడంలో గుట్టు ఏమిటని ప్రశ్నించారు.
జడ్జి యామిని హైకోర్టుకు అందించిన నివేదికలో వ్యక్తం చేసిన అనుమానాలకు.. పోలీసులు సమాధానం చెప్పాలని కోరారు. చోరీ ఘటనపై డాగ్‌స్క్వాడ్‌ను ఎందుకు తీసుకురాలేదని,.. ఫింగర్ ప్రింట్స్ ఎందుకు సేకరించలేదో పోలీసులు తెలపాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కాకాణిని మంత్రి పదవినుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: