ETV Bharat / state

'వైకాపా పాలనలో రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయి'

వైకాపా పాలనలో దళితులపై దాడులు పెరిగాయని తెదేపా ఎస్సీ సెల్ ఆరోపించింది. నెల్లూరు జిల్లా దళిత రైతు జైపాల్​ను పోలీసులు వేధించడంపై మానవ హక్కుల కమిషన్​కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

tdpleaders meeting
నెల్లూరులో తెదేపా నేతల మీడియా సమావేశం
author img

By

Published : Oct 26, 2020, 4:00 PM IST

వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో దళితులపై దాడులు అధికమయ్యాయని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఆందోళన వ్యక్తం చేసింది. ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదు చేసిన నెల్లూరు జిల్లా అనికేపల్లికి చెందిన దళిత రైతు జైపాల్​పై పోలీసులు వేధింపులకు దిగడం దారుణమని విమర్శించారు. నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు.

జైపాల్​ను బలవంతంగా జీపులో వేసుకుని స్టేషన్​కు తీసుకువెళ్లి వేధించటం మానవ హక్కుల ఉల్లంఘనేనని అన్నారు. దీనిపై మానవ హక్కుల సంఘంతోపాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్​కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ నెపంతో దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కోవడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి చేతకానితనం వల్లే పేదలకు భూ పంపిణీ ఆగుతుంటే, ఆ నెపాన్ని చంద్రబాబుపై వేయడం ఏమిటని ప్రశ్నించారు. అధికారం చేపట్టిన వెంటనే రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని ప్రకటించిన సీఎం.. వరదలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్న కనీసం 3 రూపాయలు ఖర్చుపెట్టలేదని దుయ్యబట్టారు.

ఇవీ చదవండి..

ఆకివీడు పర్యటనలో నారా లోకేశ్‌కు తప్పిన ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.