ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో తెలుగుదేశం పార్టీ ఒకరోజు దీక్ష చేపట్టింది. నగరంలోని మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ నివాసంలో ఈ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. నగర, రూరల్ తెదేపా ఇంఛార్జ్‌లు అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో నామమాత్రంగా ఏర్పాటు చేయడంతో.. పుట్టి ధాన్యాన్ని తొమ్మిది వేల రూపాయలకే అమ్ముకుంటూ రైతులు నష్టపోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ అంటూ.. రైతాంగాన్ని మోసగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతన్నకు నష్టం జరిగితే ఉద్యమిస్తామని వారు ప్రకటించారు.
ఇదీ చదవండి: గాయకుడు ఎస్పీ బాలుకు కరోనా నెగిటివ్