వైకాపా ప్రభుత్వం మోసపూరిత పాలన సాగిస్తోందని నెల్లూరు తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఆరోపించారు. బడ్జెట్లో అన్నింటికీ ఘనంగా నిధులు కేటాయించి.. ఖర్చు మాత్రం నామమాత్రంగా చేశారని మండిపడ్డారు. ఏడాది పాలనలో వైకాపా సాధించిందేమీ లేదని విమర్శించారు. ఐదేళ్ల తెదేపా పాలనలో లక్షా 6 వేల కోట్లు అప్పు చేస్తే.. వైకాపా ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే 87 వేల కోట్లు అప్పు చేసిందన్నారు.
వ్యవసాయానికి 10 వేల కోట్లు ఖర్చు చేస్తామని ఇస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 57.15 లక్షల మందికి పైగా కిసాన్ యోజన అమలు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం 49.43 లక్షల మందికే ఈ పథకాన్ని అందిస్తోందన్నారు. సంక్షేమ పథకాలను అమలుచేయకపోగా... గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేసిందని ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి... విద్యుత్ తీగలపై వెళ్లిన ఎడ్లబండి... రైతు, ఎద్దు మృతి