నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో కృష్ణపట్నం ఆనందయ్య ఔషధాన్ని ఇంటింటికీ ఉచితంగా పంపిణీ చేపిస్తామని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే కురుగొడ్ల రామకృష్ణ వెల్లడించారు. వెంకటగిరిలో ఆయన మాట్లాడుతూ... కరోనా విపత్తు కాలంలో పేదలను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. వెంకటగిరిలో మందు తయారు చేయించాలనే విజ్ఞాపనకు ఆనందయ్య సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. రామకృష్ణ స్థానిక సేవాసంస్థ ఆధ్వర్యంలో మందు తయారీకి అవసరమైన అన్ని ఖర్చులు భరించి.. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ ప్రజలకు త్వరలో మందును పంపిణీ చేస్తామని రామకృష్ణ అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా 18 ఏళ్లు దాటిన వారికి కరోనా టీకాలను వేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: