నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కరోనా టీకాలను అర్హులందరికీ వేయాలని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే కురుగొడ్ల రామకృష్ణ నిరసన చేపట్టారు. ఈ అంశంలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు మాట్లాడితే ప్రభుత్వం కేసులు పెట్టడం దుర్మార్గమని అన్నారు. తమిళనాడులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న స్టాలిన్.. వెంటనే మహమ్మారి నియంత్రణపై తగిన దృష్టి పెట్టారని.. సీఎం జగన్ ఈ అంశాన్ని గమనించాలని హితవు పలికారు.
ఇదీ చదవండి:
కడప జిల్లా మామిళ్లపల్లె శివారులో పేలుడు.. 10కి చేరిన మృతుల సంఖ్య!