వైకాపా రెండేళ్ల పాలనలో వైఫల్యాలను వివరిస్తూ. నెల్లూరులో తెలుగుదేశం పార్టీ నిరసన చేపట్టింది. నగరంలోని వెంకటేశ్వరపురం వద్ద ఉన్న టిడ్కో గృహాలు, హౌసింగ్ లేఔట్ ల వద్ద పార్టీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను.. రెండేళ్లుగా పేదలకు అందించకపోవడం దుర్మార్గమంటూ గొడుగులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్లకు పట్టిన శని పోవాలంటూ మహిళా నేతలు దిష్టి తీసి, టెంకాయలు కొట్టారు. ప్రజలను దగా చేశారంటూ హౌసింగ్ లేఅవుట్ వద్ద ధర్నా చేపట్టారు. పేదలకు టిడ్కో ఇళ్లు ఇచ్చుంటే, కరోనా సమయంలో అద్దె బాధలు తప్పి ఉండేవని, చంద్రబాబుకు మంచి పేరు వస్తుందనే.. పూర్తైన ఇళ్లను పాలకులు నిర్లక్ష్యంగా వదిలేశారని.. తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి దుయ్యబట్టారు. తొమ్మిది అంకణాల ఇళ్లస్థలాలు ఇస్తామని చెప్పి, దానిని కూడా ఆరు అంకణాలకు కుదించి ప్రజలను దగా చేశారని విమర్శించారు. ప్రతిపక్షాలను వేధించడం తప్ప, రెండేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమని ఆయన మండిపడ్డారు.
ఇదీ చదవండి: