కరోనా వైరస్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెదేపా నేతలు విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి పటిష్ఠ చర్యలు చేపట్టాలని తెదేపా నేత, నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. రక్షణ కల్పించాలని ఎన్నికల కమిషనర్ కేంద్రానికి లేఖ రాశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
ఇదీ చదవండి: