కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో మద్యం అమ్మకాలకు అనుమతివ్వడం దారుణమని నెల్లూరులో తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ.. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మహాత్ముని విగ్రహానికి నివాళులు అర్పించి.. ఆయన విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్ కు మంచి బుద్ధి ప్రసాదించాలని మహాత్ముడిని కోరారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలు కష్టాలు పడుతున్నారని అన్నారు. మద్యం వల్ల మరణాలు, గృహహింస కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. మద్యం దుకాణాలకు 8గంటలు, నిత్యావసరాల దుకాణాలకు 3 గంటల సమయం ఇవ్వడం దారుణమన్నారు. నిర్ణయం మార్చుకోకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: