కర్నూలు జిల్లాలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యలను నిరసిస్తూ నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ నేతృత్వంలో ర్యాలీ చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి సినిమా థియేటర్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. జగన్ ప్రభుత్వ అరాచకాలు రోజు రోజుకూ పెచ్చు మీరుతున్నాయంటూ వారు విమర్శించారు. వైకాపాకు ప్రజలే బుద్ధి చెప్పే రోజు వస్తుందని రామకృష్ణ హెచ్చరించారు.
ఇవీ చూడండి...