నెల్లూరు కార్పొరేషన్లో డివిజన్ల పునర్ విభజన, ఓటర్ల జాబితా వంటి విషయాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని తెదేపా ఆరోపించింది. అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా ఈ జాబితా రూపొందించారని.. తెదేపా మాజీ కార్పోరేటర్లు విమర్శించారు.
ఓ డివిజన్లో ఓటర్ల సంఖ్య అధికంగా ఉంటే.. మరో డివిజన్లో తక్కువగా చూపించారన్నారు. ప్రతిపక్షం బలంగా ఉన్న చోట ఓట్ల మార్పులు, చేర్పులు జరిగాయని తెదేపా నేత భువనేశ్వర్ ప్రసాద్ చెప్పారు. లోటుపాట్లను సవరించకుంటే.. తాము మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామన్నారు.
ఇదీ చదవండి: