పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడులోని సూపర్ మార్కెట్లపై ఆహార భద్రత అధికారులు మెరుపు దాడులు చేశారు. శ్రీ దుర్గా సూపర్ మార్కెట్ కు లైసెన్స్ లేదని గుర్తించి నోటీసులు ఇచ్చారు. ఆహార పదార్థాలపై తయారీ, గడువు ముగింపు తేదీలు లేకుండా అమ్మకాలు సాగిస్తున్నారంటూ ఆగ్రహించారు.
మరిన్ని షాపులను తనిఖీ చేసి.. నిబంధనలు విరుద్ధంగా నడుస్తున్న కొన్నింటిని మూసేశారు. లైసెన్స్ లు లేకుండా షాపులు నిర్వహిస్తే.. ఆర్నెల్ల జైలు శిక్షతో పాటు.. లక్ష జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాస్, తదితరులు దాడుల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: