ETV Bharat / state

ఆత్మకూరులో వేగంగా అభివృద్ధి పనులు.. - ఆత్మకూరు అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పట్టిన మంత్రి మేకపాటి గౌతం రెడ్డి

నెల్లూరు జిల్లా ఆత్మకూరును పూర్తిగా అభివృద్ధి చేయనున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

atmakuru
ఆత్మకూరులో వేగంగా అభివృద్ధి పనులు..
author img

By

Published : Mar 23, 2021, 8:56 AM IST

ఆత్మకూరు అభివృద్ధి పనులపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ప్రత్యేక శ్రద్ధవహించారు. ఆయన ఆదేశాల మేరకు రింగ్ రోడ్, ట్యాంక్ బండ్ నిర్మాణాల కోసం అధికారులు ప్రాథమిక దశ ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ కార్యాలయ టౌన్ ప్లానింగ్ రీజినల్ డైరెక్టర్ ధర్మారావు ఆత్మకూరులో పర్యటించారు.

తొలుత ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారులు రూపొందించిన రింగ్ రోడ్​, ట్యాంక్ బండ్ సంబంధించిన మ్యాన్యువల్ మ్యాపింగ్, గూగుల్ మ్యాప్ ను పరిశీలించారు. అనంతరం ట్యాంక్ బండ్ కోసం రూపొందించిన డిజైన్​ను పరిశీలించారు. వెంకట్రావు పల్లి నుంచి కాశినాయన ఆశ్రమం మీదగా అశ్విని పురం, జంగాలపల్లి గ్రామాల మధ్య నుంచి ఎస్​ఎంఎస్​ పార్క్ వరకు ఆత్మకూరు పట్టణాన్ని చుట్టుకుంటూ ఈ నిర్మాణం చేపట్టనున్నారు.

ఇదీ చదవండీ.. జగతి కేసులో ముగిసిన వాదనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.