ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం మైలుచర్ల గ్రామ అటవీ ప్రాంతంలో నాటు సారా స్థావరాలపై కనిగిరి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. నాటు సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 300 లీటర్ల బెల్లం ఊటను, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. నిబంధనలు అతిక్రమించి అక్రమ మద్యం అమ్మకాలు జరిపినా, నాటుసారా తయారీకి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
కర్ణాటక మద్యం స్వాధీనం
కర్ణాటకకు చెందిన మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నండగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎస్ఈబీ అధికారులు గుర్తించారు. 96 బాటిళ్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి కారు సీజ్ చేశారు. నిందితులు ఆత్మకూరు మండలంలోని నల్లపరెడ్డి పల్లి గ్రామానికి చెందిన అన్వర్ బాషా.. వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన మజ్జిగ రవీంద్రలుగా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.
ఇదీ చదవండి: 'రణ'రామతీర్థం: అధికార,ప్రతిపక్ష నేతల పర్యటనలతో ఉద్రిక్తత