నెల్లూరులో దారుణ ఘటన జరిగింది. నగరంలోని బుజబుజ నెల్లూరు ప్రాంతంలో ఓ కొడుకు కన్నతండ్రిని దారుణంగా హతమార్చాడు.
మస్తాన్ అనే వ్యక్తిని అతని కుమారుడు తాజుద్దీన్ కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతోనే తాజుద్దీన్ ఈ పాశవిక చర్యకు దిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: Nellore GGH: వైద్య విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన..సామాజిక మాధ్యమాల్లో ఆడియో వైరల్!