ETV Bharat / state

రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు 60 మంది ప్రయత్నం

author img

By

Published : Mar 28, 2020, 12:14 PM IST

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారిని పోలీసులు వెనక్కు పంపుతున్నారు. ఇవాళ నెల్లూరు జిల్లాలోని ఉదయగిరికి బెంగళూరు నుంచి 60 మంది వరకు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వారిని తిరిగి వెనక్కి పంపారు.

some-have-came-to-ap-from-other-states-and-police-sent-them-back
some-have-came-to-ap-from-other-states-and-police-sent-them-back
రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు 60 మంది ప్రయత్నం

కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుంచి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరికి వచ్చిన మూడు టెంపో వాహనాలను పంచాయతీ బస్టాండ్​ వద్ద పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపారు. ప్రకాశం జిల్లా పామూరుకి రావడానికి 60 మంది బెంగళూరు నుంచి మూడు టెంపో వాహనాల్లో బయలుదేరారు. మార్గ మధ్యంలో ఉదయగిరి పంచాయతీ బస్టాండ్​ వద్ద ఆగారు.

వాహనాల్లో వచ్చిన వ్యక్తులు కిందకి దిగి బస్టాండ్ కూడలిలో సంచరిస్తుండగా గమనించిన స్థానికులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై జ్యోతి తన సిబ్బందితో కలిసి బస్టాండ్​కు చేరుకున్నారు. లాక్​డౌన్ ఉంటే బెంగళూరు నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు అంటూ వారిని ప్రశ్నించారు. వెంటనే వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరించి వాహనాలను సరిహద్దు దాటించే ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: విశాఖను కలవరపెడుతున్న కరోనా.. ఇప్పటికే 4 పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.