ETV Bharat / state

పూర్తిగా నిండిన సోమశిల జలాశయం..12 గేట్లు ఎత్తివేత

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయం పూర్తిగా నిండిందని ఇంజనీర్ కృష్ణారావు అన్నారు. దీంతో జలాశయం ఆయకట్టు రైతులకు సాగునీరు పుష్కలంగా అందించనున్నట్లు పేర్కొన్నారు.

somasila reservoire
సోమశిల జలాశయం
author img

By

Published : Sep 22, 2020, 5:57 PM IST

సోమశిల జలాశయం పూర్తిగా నిండిందని సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారావు తెలిపారు. గడిచిన మూడు రోజుల నుంచి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు లక్ష క్యూసెక్కులు నీరు రావడంతో 12 గేట్లు ఎత్తి లక్షా 30 వేల క్యూసెక్కులు పెన్నా నదికి విడుదల చేశామని, దీంతో సముద్రంలోకి 40 టీఎంసీల నీరు వృథాగా పోయిందన్నారు.

ప్రస్తుతం జలాశయంలోకి 70 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 36 వేల క్యూసెక్కులు పెన్నానదికి విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. కండలేరు జలాశయానికి పదివేల క్యూసెక్కులు నీరు వస్తుందని.. ఈ జలాశయం కింద ఆయకట్టు రైతులకు కూడా సమృద్ధిగా నీరు ఇస్తామన్నారు.

ఇవీ చూడండి...

అధికారుల నిర్లక్ష్యం ప్రాణం మీదకు తెచ్చింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.