కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ నెల్లూరు జిల్లాలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలను తీవ్రంగా దెబ్బతీసింది. జిల్లాలో 10వేలకు పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. నగరంలోని ఆటోనగర్ వద్ద సుమారు 6వేల చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. 7 నెలలుగా పనులు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడగా పరిశ్రమలూ దెబ్బతిన్నాయి. ఆంక్షల సడలింపుతో ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నామని యజమానులు అంటున్నారు.
పూర్తిగా కోలుకోని కార్మికం
ఈ నెల నుంచే పరిశ్రమలు పూర్తిస్థాయిలో తెరుచుకున్నాయి. జన జీవనం గాడిన పడటంతో ట్రాక్టర్లు, కార్లు, బైక్‌లు, వ్యవసాయ పనిముట్ల తయారీ పరిశ్రమలు వినియోగదారులతో కళకళలాడుతున్నాయి. పరిశ్రమలు తెరుచుకోవడం కొంత ఊరట కలిగిస్తోందని యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలలుగా పనులు లేక, అద్దెలు కట్టలేక, కుటుంబ భారం పెరిగి కార్మికులు ఆర్థికంగా చితికిపోయారు. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నా జీతాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయని కార్మికులు అంటున్నారు. ప్రభుత్వం రుణ సాయమందించాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: