నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం కొత్తపల్లి గ్రామంలో రొయ్యల గుంటలను అటవీశాఖా అధికారులు పూడ్చివేశారు. కొత్తపల్లి గ్రామస్తులు గ్రామకంఠం కింద ఉన్న 16 ఎకరాల భూమిని నెల్లూరు నగరానికి చెందిన మునిరత్నంనాయుడు అనే రైతుకు లీజుకిచ్చారు. పొలం లీజుకిచ్చే రోజు అగ్రిమెంట్లో గ్రామకంఠం అనే రాసిచ్చారు. కానీ.. ఇప్పుడు ఈ భూమి అటవీశాఖ కిందకు వస్తుందని చెప్పి మొత్తం రొయ్యల గంటలను కూల్చేస్తున్నారు. కనీసం పది రోజులు టైం కూడా ఇవ్వకుండా కూల్చివేయడంతో.. 90 లక్షల రూపాయల నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. దీనిపై తెలుగుదేశం పార్టీ, వైకాపా నాయకుల మధ్య వివాదం కొనసాగుతుందని మునిరత్నంనాయుడు ఆరోపిస్తున్నాడు.
ఇదీ చూడండి: తిరుమలలో బ్రేక్ దర్శనాలపై హైకోర్టులో వాదనలు..