నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజు శేష వాహన సేవను వేడుకగా నిర్వహించారు. ఉత్సవమూర్తులైన పెనుశిల లక్ష్మీ నరసింహస్వామిలను విశేష అలంకరణలతో తీర్చిదిద్దారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఈ వేడుకలను జరిపారు. ఏకాంతంగా దేవాదాయ శాఖ నిర్వహిస్తున్న ఉత్సవాలు మరో 5 రోజుల పాటు కొనసాగనున్నాయి.
ఇదీ చూడండి.