ETV Bharat / state

Sangam Barrage: పాలకుల నిర్లక్ష్యం.. అసంపూర్తిగా సంగం బ్యారేజీ వంతెన - సంగం బ్యారేజీ వంతెన నిర్మాణం

Sangam Barrage: పాలకుల నిర్లక్ష్యం, గుత్తేదారుల బిల్లులు చెల్లించడంలో జాప్యం కారణంగా నెల్లూరు జిల్లా సంగం వంతెన నిర్మాణం 14 ఏళ్లు గడిచినా ఇంకా పూర్తి కాలేదు. ప్రభుత్వాలు మారుతున్నా, కాలాలు కరిగిపోతున్నా.. బ్యారేజీ పనులు నత్తనడకగా సాగుతూనే ఉన్నాయి. పెన్నా నదికి ఇరువైపులా అనుసంధానం పనులు నిలిచిపోవటంతో.. పరిసర ప్రాంతాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Sangam Barrage Bridge is still under construction since 14years
ముందుకు సాగని సంగం బ్యారేజీ వంతెన నిర్మాణం
author img

By

Published : May 23, 2022, 9:17 AM IST

ముందుకు సాగని సంగం బ్యారేజీ వంతెన నిర్మాణ పనులు

Sangam Barrage: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 ఏళ్లుగా నెల్లూరు జిల్లాలోని అనేక గ్రామాల ప్రజలు సరైన రవాణా మార్గం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. సంగం వద్ద పెన్నానదిపై వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో.. అధ్వానంగా ఉన్న లో లెవల్ వంతెన మార్గంలో ప్రయాణిస్తూ.. నెల్లూరు, పొదలకూరు, చేజెర్ల, సంగం మండలాల వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. భారీ గుంతలతో పాటు నదికి అడ్డుగా వేసిన ఇసుక బస్తాల నుంచి నీరు రోడ్డుపైకి చేరడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి వేళల్లో ఈ దారిలో వెళ్లేందుకు వాహనాదారులు జంకుతున్నారు..

జాతీయ రహదారిని కలిపే ఈ వంతెన మార్గంలో ఆర్టీసీ బస్సులు, లారీలు, ఆటోలు నిరంతరం రాకపోకలు సాగిస్తుంటాయి. భారీ గోతులతో పూర్తిగా పాడైన ఈ దారిలో ప్రయాణించడం వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయని స్థానికులు వాపోతున్నారు. ద్విచక్రవాహనాదారులు తరుచుగా ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వానాకాలంలో ఈ దారిలో ప్రయాణం మరింత జఠిలమవుతుందని, దాదాపు 100 గ్రామాల వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదని స్థానికులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. 14ఏళ్లుగా నిర్మిస్తున్నవంతెన నిర్మాణం పూర్తి చేసి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.