నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల సమస్యలను యాజమాన్యం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎంయు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ డిపోల్లో అన్ని కేటగిరీలలో ఖాళీలను భర్తీ చేయటంతో పాటు ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. గ్రేడ్ వన్ 9, 18 సంవత్సరాల ఇంక్రిమెంట్ లను కల్పించాలని డిమాండ్ చేశారు. శ్రామిక్ నుంచి అన్ని రకాల స్థాయిలో ఉద్యోగులకు ప్రమోషన్లు తక్షణమే కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్మికుల సమస్యల పట్ల యాజమాన్యం స్పందించకపోతే పోరాటాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. యూనియన్ చేసే పోరాటాలకు కార్మికులు సిద్ధంగా ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిపో ఛైర్మన్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి మౌలాలి, గ్యారేజి నాయకుడు ఫణికుమార్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తెలంగాణ కార్మికుల కోసం... ఇక్కడ దీక్ష..!