ETV Bharat / state

మద్యం చేసిన అనర్థాలు.. నెల్లూరులో వరుస ఘటనలు - ap latest news

రాష్ట్రంలో సోమవారం మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మందు బాబులు తాగి వాహనాలతో రోడ్డెక్కటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో సోమవారం జరిగిన రెండు ప్రమాదాలకు మద్యం కారణమైంది. మరో ఘటనలో మద్యం మత్తు ఒకరి ప్రాణాన్ని బలిగొంది.

మద్యం అనర్థాలు.. నెల్లూరులో వరుస ఘటనలు
మద్యం అనర్థాలు.. నెల్లూరులో వరుస ఘటనలు
author img

By

Published : May 4, 2020, 11:56 PM IST

నెల్లూరు జిల్లా సంగం మండలం కోలగట్ల వద్ద మద్యం మత్తులో బైక్​పై వెళ్తున్న వారిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలోబైక్​పై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే ఆత్మకూరులోని బంగ్లా సెంటర్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్​లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిద్దరూ మద్యం మత్తులో ఉన్నారు. వీరు ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

వ్యక్తి మృతి

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలో మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో ఒడ్డిపోయిన శ్రీనివాసులురెడ్డి(36) అనే వ్యక్తి మృతి చెందాడు. పలుకూరు శ్రీనివాసులురెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

యువకుల వీరంగం

మరోవైపు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేపూరులో వద్ద ఉన్న చెక్​పోస్ట్ దగ్గర మద్యం మత్తులో యువకులు వీరంగం స్పష్టించారు. ఐదుగురు యవకులు అనంత సాగరం మడలం రేవూరు గ్రామానికి వెళ్లి మద్యం సేవించి ఒక బైక్​లో ముగ్గురు, మరో బైక్​లో ఇద్దరు వస్తుండగా చెక్​ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న వీఆర్వో, వాలంటీర్లు అడ్డుకున్నారు. ఆగ్రహించిన యువకులు వారిపై దాడికి తెగబడ్డారు. స్థానికులు ఆ యువకులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో మద్యం విక్రయాల తొలిరోజు ఆదాయమెంతంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.