నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడచెలిక జాతీయ రహదారిపై కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ప్రకాశం నుంచి నెల్లూరు వైపు వస్తున్న కారు.. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వేణుగోపాల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కారులో చిక్కుకున్న బాధితులను.. అతికష్టం మీద స్థానికులు బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కొడవలూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బస్సు-కారు ఢీ... ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు - నెల్లూరులో కారు బస్సు ఢీ న్యూస్
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడచెలిక జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
బస్సు, కారు ఢీ... ఒకరు మృతి... ముగ్గురికి గాయాలు...