ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్​కు రేషన్​ వాహనదారుల వినతి - nellore district updates

నెల్లూరు జిల్లాలో రేషన్​ పంపిణీ వాహనదారులు తమ సమస్యలను పరిష్కరించాలని ఏఎస్ పేట తహసీల్దార్​కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం తమకు ఇస్తున్న వాటి కంటే అదనంగా మరో రూ.రెండు వేలు పెట్రోలు ఖర్చులకు అవుతున్నాయని వాపోయారు. కొందరు కావాలని వాహనం వద్దకు వచ్చి సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

ration motorists complaint to the tehsildar lakshmi narasimham
తహసీల్దార్​కు రేషన్​ వాహనదారుల వినతి పత్రం
author img

By

Published : Mar 5, 2021, 10:30 PM IST

నెల్లూరు జిల్లాలో రేషన్ పంపిణీ వాహనాల నిర్వహణలో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామనీ వాహనదారులు ఏఎస్​పేట తహసీల్దార్ లక్ష్మీ నరసింహానికి వినతి పత్రం అందజేశారు. తమకు ఇచ్చిన గ్రామాలు ఒకదానికొకటి దూరంగా ఉండటం వల్ల ప్రభుత్వం తమకు ఇస్తున్న వాటి కంటే అదనంగా మరో రూ.రెండు వేలు పెట్రోలు ఖర్చులకు అవుతున్నాయన్నారు.

కొందరు ప్రభుత్వ విధానాలను తప్పుబట్టే విధంగా కావాలని వాహనం వద్దకు వచ్చి లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారన్నారు. దీనివల్ల తమకు చాలా ఇబ్బందికర పరిస్థితులు కలుగుతున్నాయని వాహనదారులు వాపోయారు. సమస్యను పైఅధికారుల దృష్టికి తీసుకెళ్తానని లక్ష్మీ నరసింహం తెలిపారు.

ఇదీ చదవండి

జనసేన అభ్యర్థి నామినేషన్​ గల్లంతు.. మున్సిపల్​ కమిషనర్​కి ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.