ETV Bharat / state

'జెన్కో ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రభుత్వం విరమించుకోవాలి'

Protest against privatization of Genco: దేశంలోనే మొదటి సూపర్ క్రిటికల్ థర్మల్ స్టేషన్​ను నిర్వహించలేక రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడం దుర్మార్గమని మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు నిరసనలు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం.. ప్రైవేటీకరణకు మొగ్గు చూపటం దారుణమన్నారు. ప్రైవేటీకరణ చర్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జెన్కో పరిరక్షణ కమిటీ ఆందోళన
జెన్కో పరిరక్షణ కమిటీ ఆందోళన
author img

By

Published : Nov 22, 2022, 3:50 PM IST

Protest against privatization of Genco: నెల్లూరు జిల్లా నేలటూరులోని జెన్కో ప్రైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా జెన్కో పరిరక్షణ కమిటీ ఆందోళన చేపట్టింది. జెన్కో ఎదుట భారీ ప్రదర్శనతో పాటు మహా ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమానికి సోమిరెడ్డితో పాటు అఖిలపక్ష నేతలు హాజరయ్యారు.

జెన్కో ప్రైవేటీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టెండర్ల ప్రక్రియను విరమించుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని సోమిరెడ్డి దుయ్యబట్టారు. నష్టాలను సాకుగా చూపి జెన్కోను అదానీకి అప్పగించే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆరోపించారు. 310 రోజుల నుంచి కార్మికులు నిరసనలు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం.. ప్రైవేటీకరణకు మొగ్గు చూపటం దారుణమన్నారు. ప్రైవేటీకరణ చర్యలను వెనక్కి తీసుకునే వరకు ఆందోళన ఆగదని పరిరక్షణ కమిటీ నేతలు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.