ETV Bharat / state

పోలీసుల మానవత్వం..మహిళ ప్రాణాలు రక్షించినందుకు అభినందనలు - police saved woman at nellore district news update

ప్రజల రక్షణే ధ్యేయంగా పని చేస్తున్న పోలీసులు.. ఒకవైపు కరోనా మహమ్మారితో జరుగుతున్న యుద్ధంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న రక్షక భటులు.. నెల్లూరు జిల్లాలో ఓ మహిళ ప్రాణాలు కాపాడి మన్ననలు పొందుతున్నారు. ఇంతకీ ఆ మహిళకు ఏం జరిగింది.. ఆమెకు పోలీసులు ఏ విధంగా సాయపడ్డారు..?

Police saved the women life
మహిళ ప్రాణాలు కాపాడి మానవత్వం చాటిన పోలీసులు
author img

By

Published : Jul 19, 2020, 8:16 PM IST

నెల్లూరు జిల్లా మర్రిపాడులో ఓ మహిళ ఇంటి వద్ద పని చేసుకుంటుండగా తేలు కాటుకు గురైంది. దీంతో ఆ మహిళ ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో పోలీసులకు ఫోన్ చేసింది. మాకెందుకులే అనుకోకుండా.. వెంటనే స్పందించిన పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళను ఆటోలో మర్రిపాడు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించి.. మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

దీంతో సదరు మహిళ ప్రాణాలతో బయటపడింది. సకాలంలో స్పందించి.. మహిళకు సాయం చేసి ప్రాణాలు కాపాడిన పోలీసులను మండల ప్రజలు అభినందనలతో ముంచెత్తారు.

ఇవీ చూడండి...

'కరోనా కేంద్రంలో పురుగులన్నం పెడుతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.