శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సీతారామపురం మండలం చింతోడు అటవీ ప్రాంతం నుంచి నీళ్ళ ట్యాంకర్లో అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన రూ.1.25 కోట్ల విలువ చేసే 92 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చింతోడు గ్రామానికి చెందిన రాచూరి రవి అనే వ్యక్తి మరికొందరితో కలిసి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు నరికి నిల్వ చేశారని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. వాటిని వింజమూరుకు చెందిన భీమిరెడ్డికి విక్రయించగా.. అతను గుట్టుచప్పుడు కాకుండా నీళ్ల ట్యాంకర్లో వాటిని తరలిస్తున్నట్లు గుర్తించి.. తనిఖీ చేశామని అన్నారు. ట్రాక్టర్‌తో పాటు ఒక ఆటో, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నిందితులు భీమిరెడ్డి ఓబుల్‌రెడ్డి, పవన్‌కుమార్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో మరో 9 మంది ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: