పోలీస్ శునకాల పదవీ విరమణ కార్యక్రమం నెల్లూరులో ఘనంగా జరిగింది. నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సింధు, లక్కీ అనే పోలీస్ శునకాలు పదవీ విరమణ చేశాయి. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ విజయరావుతోపాటు, పలువురు అధికారులు హాజరయ్యారు.
దాదాపు పదేళ్ల పాటు సేవలందించిన సింధు, లక్కీలకు పూలమాలు వేసి, శాలువా కప్పి పోలీసులు ఘనంగా సత్కరించారు. పోలీసు విధుల్లో సింధు, లక్కీలు చేసిన సేవలను జిల్లా ఎస్పీ కొనియాడారు. పలు కేసుల దర్యాప్తుల్లో వీటి సహకారం మరువలేమని ప్రశంసించారు.
ఇదీ చదవండి: