నెల్లూరులో ఓ వాహన దొంగను పోలీసులు 24 గంటల వ్యవధిలోనే చాకచక్యంగా పట్టుకున్నారు. నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 24వ తేదీన బొలెరో వాహనం చోరీకి గురైంది. చోరీపై యజమాని ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుచ్చి, ఆత్మకూరు టోల్ గేట్ల వద్ద విచారించిన పోలీసులు వాహనం చెన్నైకి తరలిస్తుండగా పట్టుకున్నారు.
గతంలో ఆ వాహనానికే డ్రైవర్గా పనిచేసిన శివ అనే వ్యక్తే దొంగని పోలీసులు గుర్తించారు. డ్రైవర్గా పని చేసే సమయంలో తాళం పోయిందని యజమానిని నమ్మించాడు. పని మానేసిన తర్వాత ఆ వాహనాన్నే చోరీ చేశాడు. ఒకరోజు వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులను నగర డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి అభినందించారు.
ఇదీ చదవండి: జొన్నవాడ క్షేత్రం చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు