Cemetery troubles: నెల్లూరు జిల్లా పాటూరు తూర్పుపల్లెపాలెంలో.. శ్మశాన వాటికకు వెళ్లడానికి పంట కాలువ దాటుకుని వెళ్లాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లడం కోసం.. పంట కాలువ దాటి వెళ్లడం కష్టంగా మారిందని అంటున్నారు. పంటకాలువపై వంతెన నిర్మాణం కోసం మెుక్కుబడిగా శిలాఫలకం ఏర్పాటు చేశారని తెలిపారు. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి పనులు చేపట్టకపోవడంపై గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైతులు పంట పొలాలకు వెళ్లాలన్నా, పంట ఉత్పత్తులు తీసుకురావాలన్నా కాలువ దాటాల్సి వస్తోందన్నారు. ఇప్పటికే అధికారులకు వినతి పత్రాలు అనేకసార్లు ఇచ్చామని తెలిపారు.
ఇవీ చదవండి: