రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీలో జరుగుతున్న దౌర్జన్యాలు, అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. పేద, బలహీన వర్గాల ప్రజల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడాన్ని ఆయన ఆక్షేపించారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వెంకన్నపాలెంలో దళితుడైన వెంకటయ్య భూమి కోసం దౌర్జన్యానికి పాల్పడటం దారుణమన్నారు.
నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పేదల భూముల కోసం దౌర్జన్యకాండ సాగుతోందని విమర్శించారు. న్యాయస్థానాల తీర్పును సైతం లెక్కచేయకుండా వైకాపా నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ భూదందాలపై విచారణ జరిపించాలని కోరుతూ... తాము మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు.