నెల్లూరు జిల్లాలో ఈ సీజన్లో రైతులు.. మూడు లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రస్తుతం జిల్లాలో పంట కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవటానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మద్దతు ధరకు పంట కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ... క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఫలితంగా దళారులు, మిల్లర్లకు తక్కువ ధరకే ధాన్యాన్ని విక్రయిస్తూ... ఆర్థికంగా నష్టపోతున్నారు.
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం 75 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఇప్పటివరకు కేవలం 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. ఈ ఏడాది ధాన్యం దిగుబడులు కూడా బాగా తగ్గాయని, కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచదవండి.