నెల్లూరు జిల్లా విడవలూరు మండలం తాడిచెట్లదెబ్బ గ్రామానికి చెందిన 40 కుటుంబాలు పంచాయతీ పరిధిలోని స్థలంలో గత 20 ఏళ్లుగా గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సర్వే నెంబర్ 1011 కి చెందిన స్థలాన్ని ఆక్రమించేందుకు కొంతమంది అధికార పార్టీ నాయకులు సిద్ధమయ్యారని గ్రామస్థులు మండిపడ్డారు. ఈ విషయాన్ని ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో చేసేది లేక నెల్లూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో గ్రామస్థులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ భూమిని పేదలకు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని సీపీఐ నాయకులు హెచ్చరించారు.
'ప్రభుత్వ భూమిని పేదలకు ఇచ్చే వరకు పోరాటం చేస్తాం' - నెల్లూరు తాజా న్యూస్
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం తాడిచెట్లదెబ్బ పరిధిలో గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్న గ్రామస్థుల స్థలాన్ని అధికార పార్టీ నాయకులు ఆక్రమిస్తున్నారని బాధితులు ఆరోపించారు. దీంతో నెల్లూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట గ్రామస్థులు ధర్నా చేపట్టారు.