లాక్డౌన్ నేపథ్యంలో ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని నెల్లూరులోని ఎంఎస్ఆర్ సేవా సమితి వ్యవస్థాపకుడు మాగుంట శరత్ చంద్రారెడ్డి కోరారు. తమ సేవా సమితి ఆధ్వర్యంలో 'నో-స్కూల్, నో-ఫీజ్' కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన నెల్లూరులో ప్రకటించారు.
ప్రస్తుతం పాఠశాలలు మూసివేసి, ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నందున, అందుకు తగ్గ నామమాత్రపు రుసుమునే పాఠశాలల యాజమాన్యం వసూలు చేయాలని కోరారు. ఫీజుల పేరుతో తల్లిదండ్రులను ఒత్తిడికి గురి చేస్తే ఆయా పాఠశాలలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి, ఆందోళన నిర్వహిస్తామని ప్రకటించారు. అధిక ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలన్నారు.
ఇది చదవండి ఉషారాణిని పరామర్శించిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి