కరోనా దెబ్బకు ప్రపంచం అల్లకల్లోలం అవుతోంది. భౌతిక దూరం పాటించడం, మాస్కుల వినియోగం, శానిటైజర్లు ఉపయోగించాలని నిత్యం అవగాహన కల్పిస్తున్నా నెల్లూరు జిల్లా డక్కిలి మండలంలో మాత్రం ఆ దిశగా చర్యలు కనిపించట్లేదు. మండలంలో సుమారు 800 మంది ఉపాధి హామీ కూలీలున్నారు. వారి రక్షణకు అధికారులు కనీస చర్యలు చేపట్టకుండానే పనులు చేయిస్తున్నారు. కరోనా భయంతో బిక్కుబిక్కుమంటూ పనులు చేయాల్సి వచ్చిందని కూలీలు వాపోయారు. ఈ విషయమై ఎంపీడీవో వెంకటేశ్వరరావును వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు ప్రారంభించామని.. ఎలాంటి కరోనా వైరస్ రక్షణ పరికరాలు తమకు అందలేదన్నారు.
ఇవీ చదవండి.. 'అమ్మా... మిమ్మల్ని చూస్తే మాకు ధైర్యం వస్తుంది'