నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం కూరగాయల మార్కెట్ వద్ద శనివారం ఉదయం భారీగా జనం చేరుకున్నారు. జిల్లాలో పాజిటివ్ కేసులు పెరిగినందున వారం రోజుల పాటు దుకాణాలు పూర్తిగా మూసివేస్తారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగింది. దీనిని నమ్మిన ప్రజలు వందలాదిగా మార్కెట్ వద్దకు చేరుకున్నారు. సామాజిక దూరాన్ని ఎక్కడా పాటించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జనాన్ని పంపేశారు. మరోవైపు అధికారులు వీధుల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని ప్రత్యేక వాహనాల్లో పిచికారి చేయించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 180 కరోనా పాజిటివ్ కేసులు